Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలం రాగానే చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, పగుళ్లు రావడం.. వంటి సౌందర్యపరమైన సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే బ్యూటీ ప్యాక్స్ ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు.
అరటి, పెరుగుతో: సహజసిద్ధంగా బాగా పండిన అరటిపండు తీసుకొని మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న అరటిపండు గుజ్జు అరచెంచా తీసుకొని దానికి చెంచా చొప్పున తేనె, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని డల్ స్కిన్ ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. పెరుగు, తేనె చర్మానికి తేమని అందిస్తే, అరటిపండు నిర్జీవంగా మారిన చర్మానికి తిరిగి జీవం పోస్తుంది.
బాదంతో: బాదంపై ఉండే పొట్టు తొలగించి కొద్దిగా పాలు జత చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖం, మెడకి ప్యాక్‌లా అప్త్లె చేసుకోవడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందడమే కాదు.. శీతాకాలంలో ఎలాంటి చర్మసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందే జాగ్రత్తపడచ్చు. ఈ ప్యాక్ ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. తాజా చర్మం మన సొంతం అవుతుంది.