Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇదే చాలామంది కోరుకుంటారు. గత ఏడాది ఎక్కువమంది ఆసక్తి చూపిన వాటిల్లో 'ఏబీసీ జ్యూస్' ఒకటి. తారలూ ప్రయత్నించిన దీని సంగతేంటో మీరూ చూసేయండి.
ఆపిల్, బీట్రూట్, క్యారెట్లతో చేసింది కనుక దీనికి 'ఏబీసీ' జ్యూస్ అని పేరు. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని ఒక గ్లాసు ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి.
ఆపిల్లో పోషకాలు మెండు. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లనీ దరిచేరనీయవు.
బీట్రూట్లో ఉండే గుణాలు డీటాక్సిఫై చేసి శరీరంలోని మలినాలను బయటకు పంపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతాయి.
కెరొటినాయిడ్స్, విటమిన్లు, ఫైబర్.. క్యారెట్ ద్వారా అధిక మోతాదులో అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లూ, మినరల్స్.. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపడంలో సాయపడతాయి.
ఈ మూడూ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే మలినాలను బయటికి పంపేస్తాయి. వీటిల్లోని ఫైబర్ కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి కలిగించవు. కెలోరీలూ తక్కువే. అయితే రోజంతా దీనిపైనే పూర్తిగా ఆధారపడొద్దు అంటారు నిపుణులు. దీంతోపాటు తక్కువ కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్ ఉండే బ్యాలెన్స్డ్ డైట్నీ తీసుకోవడం తప్పనిసరట. ప్రయత్నించేయండి మరి!