Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత రోజుల్లో మన జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఇతర చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో కడుపు సమస్య కారణంగా మరిన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు మలబద్ధకం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంలో మార్పులు చేసుకోవటం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. ఏది ఏమైనా వేసవి కాలం ప్రారంభం కానుంది. కాబట్టి పెరుగు, అరటిపండును సరిగ్గా ఉపయోగిస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఈ రెండు మార్కెట్లో చాలా చౌకగా లభిస్తాయి కూడా. మీ శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనవి. మలబద్ధకం సమస్యను నివారించగలుగుతాయంటున్నారు.
మలబద్ధకం నుండి ఉపశమనం: మలబద్ధకంతో బాధపడేవారు అల్పాహారంలో అరటిపండు, పెరుగు తీసుకోవాలి. ఈ రెండు ఆహారాలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు కూడా ఇది మేలు చేస్తుంది. అరటిపండు, పెరుగు కలిపి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదనంగా ఇందులో విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు కూడా ఉన్నాయి. అరటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ ఉన్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అల్పాహారం సమయంలో ఈ రెండు ఆహారాలను తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది.
పెరుగుతో కలిపి తింటే: అరటిపండ్లు తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా కాల్షియం శోషణ జరుగుతుంది. అల్పాహారంలో అరటిపండు, పెరుగు చేర్చడం వల్ల మీ ఎముకలు దృఢంగా ఉంటాయి. అరటిపండుతో పాటు పెరుగు తింటే కొవ్వు కరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాగే దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.