Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనందరికీ ఇంటిని చక్కదిద్దుకోవడం, వంటావార్పూ కంటే కష్టమైన సంగతి పిల్లల పెంపకం. వాళ్లు చెప్పిందానికల్లా ఒప్పుకుంటే ఇక ఎప్పుడైనా కాదంటే ఊరుకోరు. మొండివైఖరితో ఎలాగైనా అనుకున్నది సాధించుకోవాలని చూస్తారు. అలాగని ప్రతిదానికీ వ్యతిరేకిస్తే బేలగా, అధైర్యంగా తయారవుతారు. ఈ రెండు పద్ధతులూ సరికాదు, సంయమనంతో వ్యవహరించాలి అంటున్నారు మానసిక నిపుణులు. అలాగే చిన్నారులకు పనులు అలవాటు చేయాలట. మరి వారి సలహాలూ, సూచనలూ పాటించి మన చిన్నారులకు ఉజ్జ్వల భవిష్యత్తునిద్దామా...
- తోటిపిల్లల ప్రభావంతోనో, టీవీలో ప్రకటనలకు ఆకర్షితులయ్యో కోరికల చిట్టా ముందుపెడతారు. వాటి కోసం నానా రకాలుగా బతిమాలతారు. ఇంతగా ప్రాధేయపడుతున్నారు కదాని జాలీదయా వర్షించేస్తూ ఖర్చెక్కువైనా వస్తువుల్ని ఇచ్చేస్తుంటే.. ఇక పిల్లల్లో ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అవి గొంతెమ్మ కోరికలుగా మారక ముందే అప్రమత్తమై నిబంధనలు పెట్టండి.
- క్యారమ్బోర్డ్, చదరంగం, వైకుంఠపాళి లాంటి ఆటలయ్యాక ఆ సాధనాలను తీసిన చోట పెట్టేలా చూడండి. తినేశాక పళ్లేలూ గ్లాసులూ వెంటనే కడిగి స్టాండ్లో పెట్టేలా, డ్రెసింగ్ టేబులు, వార్డ్రోబ్లను చిందరవందర చేయకుండా ఉండేట్లు తర్ఫీదివ్వండి. అన్నీ మీరే చేస్తుంటే ఇక వాళ్లకి దేని మీదా శ్రద్ధాసక్తులు ఉండవు. బుద్ధి వికసించదు కూడా.
- పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరమే. కానీ అది శిక్షలా కాదు, శిక్షణలానే ఉండాలి. సామర్థ్యాలను పెంచుతూ, తమకు తాము బాధ్యతగా ఉండేలా చూడాలి.