Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు పీరియడ్స్ చాలా ముఖ్యమైనవి. అవి సకాలంలో రావడం శరీర ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కానీ కొందరిలో పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఆ విషయాన్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఎన్నో అనారోగ్యాలకు సూచన కావచ్చు. ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా పీరియడ్స్ రావడం సర్వసాధారణం. కానీ ఒక నెల వచ్చి ఇంకో నెల రాకపోవడం లాంటివి జరిగితే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. దీనికి గల కారణమేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎక్కువ కాలం పాటు ఒత్తిడికి గురవుతున్న వారిలోనూ రుతు చక్రం దెబ్బతింటుంది. ఒత్తిడి కారణంగా క్రమరహిత పీరియడ్స్ లేదా లేట్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కడుపునొప్పి, పొత్తికడుపు దగ్గర తిమ్మిరిగా అనిపించడం వంటివి కూడా జరుగుతాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం ఒత్తిడి రాకుండా వ్యాయామం చేయడం చేయాలి. ఆరోగ్యకరమైన తాజా ఆహారం తినాలి.
చాలామంది గర్భనిరోధక పద్ధతులను పాటిస్తారు. అందులో గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాత్రలు శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్లలో తీవ్ర మార్పులకు కారణం అవుతాయి. కాబట్టి వీటి వల్ల కూడా రుతుక్రమం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
హార్వర్డ్ హెల్త్ చెబుతున్న ప్రకారం పిసిఓఎస్ ఉన్న చాలామంది ఆండ్రోజెన్ హార్మోన్ను కలిగి ఉంటారు. దీనివల్ల అండాశయాలపై చిన్న గాలి తిత్తులు ఏర్పడతాయి. వాటి వల్ల జుట్టు అధికంగా పెరగడం, మొటిమలు, పిల్లలు పుట్టకపోవడం, అధిక బరువు పెరగడం, క్రమరహిత రుతుక్రమం వంటివి కలుగుతాయి. కాబట్టి పీరియడ్స్ మిస్ అయితే పిసిఓఎస్ సమస్య ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం.
అధిక బరువు వల్ల పునరుత్పత్తి వ్యవస్థను నియంత్రించే హార్మోన్ ఈస్ట్రోజన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పీరియడ్స్ మిస్ అవ్వడం, ఆలస్యంగా రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.