Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలసరి సమయంలో నొప్పి, అసౌకర్యం.. లాంటివి సాధారణమే! అది వచ్చినపుడే కాదు.. ఆలస్యమైనప్పుడూ శారీరకంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాతావరణ మార్పులు, జీవనశైలి కారణంగా చాలామందికి నెలసరి తప్పుతుంటుంది. సరైన సమయానికి రావాలంటే వీటిని అనుసరించమంటున్నారు నిపుణులు.
- కొద్దిపాటి వ్యాయామం కండరాలకు విశ్రాంతి నివ్వడమే కాదు.. నెలసరిని క్రమబద్ధీకరించడంలోనూ సాయపడుతుంది. తేలిక నుంచి మధ్యస్థ వ్యాయామాలను రోజులో భాగం చేసుకోండి. సాధారణంగా అధిక బరువు, హార్మోనుల్లో అసమతుల్యత నెలసరి ఇబ్బందులకు కారణమవుతుంది. - వ్యాయామం ఈ రెంటికీ చెక్ పెట్టేయగలదు. నడక, ఏరోబిక్స్, డ్యాన్స్.. ఇలా - నచ్చినదానికి రోజూ 30 నిమిషాలు కేటాయించాలంతే.
- శారీరక సమస్యలే కాదు.. ఒత్తిడి ప్రభావం కూడా నెలసరిపైనే పడుతుంది. కాబట్టి, వీలైనంత ప్రశాంతంగా మనసును ఉంచుకునే ప్రయత్నం చేయండి. స్నేహితులతో సమయం గడపడం, పాటలు వినడం.. ఇలా మీ మనసుకు శాంతిని చేకూర్చే వాటిపై దృష్టిపెడితే సరి.
- విటమిన్ సి ఈస్ట్రోజన్ స్థాయులను పెంచుతుంది. అంతేకాదు శరీరక ప్రక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన వేడినీ పుట్టించగలదు. ఇది మెన్స్ట్రువల్ సైకిల్కీ ప్రయోజనకరం. కాబట్టి ఇది ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలకు రోజువారీ ఆహారంలో చోటివ్వండి.
- నెలసరిని క్రమబద్ధీకరించడంలో బెల్లానిదీ ప్రధాన పాత్రే. సంప్రదాయ విధానమే అయినా బాగా పనిచేస్తుంది కూడా. అదనంగా ఐరన్, హిమోగ్లోబిన్నీ వృద్ధి చేస్తుంది. రోజూ తీసుకుంటే సరిపోతుంది.