Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం జీవితంలో సగటున 3,000 రోజులు నెలసరితో గడుపుతాం. అంటే ఎనిమిదేళ్లకు పైగా అన్నమాట. ఆ రోజులు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటాయి. కొందరైతే దుర్భర కడుపునొప్పి, ఓవర్ బ్లీడింగ్, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారాలతో బాధపడుతుంటారు. ఇంకొందరు పొత్తికడుపులో పోట్లతో ప్రసవవేదనను తలపించేంత యాతన అంటూ ఇబ్బంది పడుతుంటారు. ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ కారణంగానే నెలసరి సెలవు మంజూరు చేయాలంటూ గళం విప్పారు. ఇదెంతో అవసరమని ఉద్యోగినులు వాదిస్తోంటే.. కొన్ని కంపెనీలు మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో దీని పరిణామాలూ పర్యవసానాలేంటో చూద్దాం..
- మెన్స్ట్రువల్ లీవ్ చాలా మంచి ఆలోచన. నెలసరిలో యాతన అనుభవించేవారికి ఈ సెలవు ఎంతగానో తోడ్పడుతుంది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుని ఆరోగ్యంగా ఉండటమే కాదు, మరింత శక్తి పుంజుకుని హుషారుగా పనిచేస్తారు' అంటున్నారు కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జెస్సికా బర్నాక్. రుతుస్రావానికి సంబంధించిన అంశాలపై ఏండ్ల తరబడి పరిశోధన చేశారు.
- 20 శాతం స్త్రీలు నెలసరిలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. 80 శాతం మంది 50 ఏండ్లు వచ్చేలోపు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్తో అవస్థపడుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఆ రోజుల్లో సెలవు ఇచ్చేందుకు సంస్థలకు అభ్యంతరం లేదు కానీ అది పెయిడ్ లీవ్ అంటేనే వివాదాస్పదమౌతోంది. ముఖ్యంగా అత్యధిక జీతాలు చెల్లించే కార్పొరేట్ సంస్థలు గంటకు ఇంతని లెక్కకట్టి అది తమకెంత నష్టదాయకమో వివరిస్తున్నాయి.
- దక్షిణ కొరియా, ఇండోనేషియా, జాంబియా లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే నెలసరి సెలవలను ఆమోదించి అమలుపరిచాయి. దేశంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సహా ఎన్నో సంస్థలు తన ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించింది.
- 'నెలసరి సెలవు అమలైతే స్త్రీల సామర్థ్యాన్ని కించపరచడం, వ్యతిరేకత చూపడం, వివక్ష ఎక్కువవడం లాంటివే కాదు.. అనేక సంస్థలు ఉద్యోగం ఇవ్వడానికే నిరాకరించే ప్రమాదముంది' అంటున్నారు విశ్లేషకులు. ప