Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జామ ఆకులు చర్మం, జుట్టుకు చాలా మేలు చేస్తాయి. చాలా మంది ముఖం కడుక్కోవడానికి నీటిలో జామ ఆకులను ఉపయోగిస్తే, కొందరు తలస్నానానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చర్మం, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను అధిగమించడానికి సహాయ పడుతుంది.
- జామ ఆకులలో చర్మం, జుట్టుకు అవసరమైన విటమిన్ సి, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి పుష్కలమైన ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.
- జుట్టు రాలడం, పెళుసుగా మారడం, పలుచబడడం వంటి అనేక జుట్టు సమస్యలకు చుండ్రు కూడా ఓ కారణం. జామ ఆకు నీరు స్కాల్ప్ మురికి, స్కాల్ప్ అలర్జీలు, చుండ్రు, సోరియాసిస్ మొదలైన వాటిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును తొలగించి జుట్టును ఒత్తుగా చేస్తుంది.
- పొడి, చిట్లిన జుట్టును వదిలించుకోవడానికి జామ ఆకు సహాయపడుతుంది. తెల్ల జుట్టును నివారిస్తుంది. జుట్టు పెరగడానికి, కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
- జామ ఆకుల నీటితో స్నానం చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, అలర్జీలు, దద్దుర్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి. ఇది చర్మంలోని మృతకణాలను శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది.
- జామ ఆకు నీరు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. గీతలు, ముడతలను తగ్గించడంలో అలాగే రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో చర్మం సజీవంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
- జామ ఆకుల నీటితో స్నానం చేయడం వల్ల పొడి చర్మం సమస్యను తొలగించి, మృదువుగా ఉండే చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది. అలెర్జీ కారకాలను తొలగించడానికి, చర్మంలోని తేమను లాక్ చేయడానికి సహాయపడుతుంది.