Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల:విద్యుద్ఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలపరిధిలోని పిల్లల జగ్గుతండా ఆవాసం బొజ్జతండాలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన బానోత్ ముక్యాకు చెందిన గుడిసెకు ప్రమాదవశాత్తు విద్యుద్ఘామ వ్వడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లోని దుస్తులు, వ్యవసాయ పట్టాదారు పాసుపుస్తకం, ద్విచక్రవాహనం కాలిపోయింది.గేదె, ఆవుకు తీవ్రగాయాల య్యాయి.సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది.