Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య పాదయాత్ర ఈ నెల 5న మండల కేంద్రానికి చేరుకుంటున్న సందర్భంగా కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి కొల్లూరి ఆంజనేయులు కోరారు. గురువారం మండల పరిధిలోని ఇక్కుర్తి దిలావర్పూర్ గ్రామాల్లో పంచాయతీ ,భవన నిర్మాణ కార్మిక సంఘం, హమాలీ సంఘం, పెయింటర్స్, స్కూల్ స్వీపర్లు,మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించి చైతన్య పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతన చట్టం అమలు చేసి రూ.24 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఈర్ల మైసయ్య, ఆడెపు స్వామి, మామిడాల కనకయ్య, పంగ రాజు, బుగ్గ శ్రీశైలం, ఎస్.కే షరీఫ్, దేవరాజ్, పోచయ్య, వీసం అంజయ్య, శ్రీమంతుల వెంకటేశ్వర్లు, బోగారం వీరస్వామి, బొట్ల హరికుమార్, కందుల సురేందర్, క్యాసగళ్ళ రవి, వంగపల్లి బాబు, పాండు, బిక్షపతి, బొట్ల గణేష్, కప్పే మల్లేష్, గంధమల్ల సత్యనారాయణ, నరసింహ, రాములు, తిరుమలమ్మ, లక్ష్మీనరసింహ, ఉప్పలయ్య, యాదమ్మ, ఎల్లమ్మ,లక్ష్మి, కిష్టయ్య, రాధా, కపాకర్, మదర్,ఇస్తారి, పెద్దలు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలరామరం : మండలం సమాగ్రాఅభివద్ధి కోసం సాగుతున్న సీపీఐ(ఎం)మహాజన పాదయాత్ర ను జయప్రదం చేయాలని అని ఆబ పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు. గురువారం మండలంలో సీపీఐ(ఎం)మహాజన పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17న బొమ్మలరామారం మండలానికి పాదయాత్ర విచ్చేస్తున్నసందర్భంగా పాదయాత్రలో కార్మికులు, ప్రజలు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైలారం లక్ష్మయ్య, ఏలూరు కష్ణయ్య, సల్లూరి కుమార్ ముక్కల పున్నమ్మ కమల నాయక్ పాల్గొన్నారు.