Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదు
- టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా జానారెడ్డి గెలుపు ఖాయం
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -నల్గొండ
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్ల దోపిడీకిీ పాల్పడ్డ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణలో తప్ప ఎక్కడ చూడలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో భాగంగా గుర్రంపోడులోని క్షత్రీయ కాలేజీలో నిర్వహించిన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఎంపీ సమక్షంలో టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి ఏపీ సీఎం పదవిని ఇస్తామన్న వద్దని చెప్పిన వ్యక్తి జానారెడ్డిని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 20ఏళ్లు మంత్రిగా పనిచేసిన మచ్చలేని రాజకీయ నేతగా ఉండడం జానారెడ్డికే సాధ్యమన్నారు. కాంగ్రెస్ హయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యున్నే ఏకగ్రీవం చేసిందని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలుగా ఉన్న కిష్టారెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోతే టీఆర్ఎస్ అభ్యర్థులను నిలిపి వందల కోట్లు ఖర్చు పెట్టి వారి అభ్యర్ధులను గెలిపించుకుందని విమర్శించారు. లాయర్ దంపతుల హత్య జరిగితే చూడడానికి వెళ్లని మంత్రులు నేడు ఎన్నికలు అనే సరికి రెక్కలు కట్టుకుని వాలుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయంలో ఎస్ఎల్బీసీ కోసం 8వేల కోట్లు ఖర్చు పెట్టిందని మరో వెయ్యి కోట్లు ఖర్చు పెడితే గుర్రంపోడు నకిరేకల్ , నల్గొండ వరకు శ్రీశైలం నీరు పారేదని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుకు ఏడేళ్లుగా వెయ్యి కోట్లు ఇవ్వని కేసీఆర్కు నల్గొండలో పర్యటించే హక్కు లేదన్నారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్. బ్రహ్మణవెల్లంల, శ్రీశైలం సొరంగం పనులకు మొండి చెయ్యి చూపుతున్నారని మండిపడ్డారు. కౌలురైతులు చేసిన అప్పులు తీర్చలేక మంచిర్యాల, సిద్దిపేట జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. పంజాబ్లో కౌలు రైతులకు రుణ మాఫీ, రైతు బంధు అందజేస్తున్నట్లు వెల్లడించారు. పబ్లిక్ సర్వీస్ సభ్యులను నియమించలేని సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. నిరుద్యోగ భతి కావాలంటే యువత టీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోమాజీ నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ , నల్లగొండ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య ,నల్లగొండ ఎంపీపీ మని మధ్య సుమన్ ,గుర్రంపోడు కనగల్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు