Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేశ్
నవతెలంగాణ- నల్లగొండ
కరోనా పేరుతో విద్యాసంస్థలను బంద్ చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేశ్ అన్నారు. శుక్రవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో విద్యాసంస్థలు ప్రారంభించాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్లకు సినిమా హాల్ లేని బంద్ విద్యా సంస్థలకే ఇవ్వడం దుర్మార్గమైన చర్యన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం విద్యా సంస్థలు ప్రారంభించి ఎన్నికలు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు మూసి వేశారని ఆరోపించారు. కరోనా జాగ్రత్తలు పాటించి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యాసంస్థలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కరోనా కారణంగా ఇప్పటికే ప్రైవేటు టీచర్స్ వీధిన పడ్డారు అన్నారు. మళ్లీ బందు చేయడం వల్ల వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్స్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఖమ్మం పాటి శంకర్ ,యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకులు ఏడుకొండలు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్ ,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు యువరాజ్ ,నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ పాల్వాయి రవి, డీవైఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, బేగ్, నవీన్, ప్రైవేటు ఉపాధ్యాయులు సోమయ్య ,ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు చంద్రమౌళి రవివర్మ, నాగేశ్వరరావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.