Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులు లేరు... ఉన్నా రారు..
- సూపరింటెండెంట్ ఉన్నా లేనట్టే
జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రి పేరుకే పెద్దది.. సకల సమస్యలకు నిలయంగా మారింది. ఏ రోగిని మందిలించినా వైద్యం అందుతున్న తీరు... డాక్టర్ల నిర్లక్ష్యంపై స్పష్టంగా తెలియజేస్తారు.. డాక్టర్లు లేరూ.. ఉన్న వాళ్లు అందుబాటులో ఉండరూ.. గంటసేపు ఓపి చూస్తే అదే మా బాగ్యం.... ఇక హాస్పిటల్కు ఓ పెద్ద అధికారి ఉంటాడు.. అయన ఏం చేస్తడో.. ఎపుడోస్తడో.. ఎప్పుడు పోతడో తెలియదు.. దవాఖానా సంగతులు ఏం ఆయనకు పట్టిలేవు.. హాస్పిటల్లో రోగుల సమస్యలు ఏవరికి చెపుకుందామన్న కనిపించని పరిస్థితి ఉంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రిభువనగిరి జిల్లా నూతనంగా ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్న ఏరియాస్పత్రి జిల్లా ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. దాంతో నియోజకవర్గ ప్రజలతో పాటుగా జిల్లా ప్రజలు కూడా వైద్యం అందుబాటులోకి వస్తుందని సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.. ఆస్పత్రిలో 50 డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. కానీ నేడు కేవలం 18మంది డాక్టర్లు మాత్రమే రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏరియా హాస్పిటల్గా ఉన్నపుడు ఈఎన్టి, చర్మ, జనరల్ సర్జన్, ఫిజిషియన్ వైద్యులు ఉండేవారు.. ఇపుడు వాళ్లు కూడ లేరు. రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల కూడ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్చార్జి అధికారి కావడంతో ఆయన పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఏ సమస్యల పట్ల కూడా స్పందించరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొంత ప్రాక్టీసే ముద్దు...
ప్రభుత్వ వైద్యులు సొంతంగా ప్రయివేటు ప్రాక్టీస్ చేసుకునే హక్కుందనే నెపంతో తాము నిర్వహించాల్సిన విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పేదలే ఎక్కువగా ప్రభుత్వ వైద్యం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. కానీ డాక్టర్లు ఇక్కడ విధులు నిర్వహించడం కన్నా సొంత హాస్పిటల్లో చికిత్స చేయడానికి ఇష్టపడుతుంటారు.గతంలో 9గంటల 12గంటల వరకు బయటి రోగులకు చికిత్స అందించేవారు. కానీ ఇపుడున్న వైద్యులు 10గంటల తర్వాతనే విధులకు హాజరై 2గంటలలోపు ముగించేస్తారు. దీంతో ఆనారోగ్యంతో ప్రభుత్వ వైద్యం కోసం వచ్చిన పేదలకు న్యాయమైన వైద్యం అందడంలేదు.జిల్లా కేంద్ర హాస్పిటల్లో సూపరిండెంట్, ఆర్ఎంవో, వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండాలి. కానీ కేవలం నలుగురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.
ఆకస్మీకంగా ఆనారోగ్యం పాలైతే .. ఇక అంతే....
ఆకస్మీకంగా ఎవరైనా ఆనారోగ్యం పాలైతే ధనవంతులైతే కార్పోరేట్ హాస్పిటల్కు వెళుతారు.. కానీ పేదవాడైతే ప్రాణాలు పోవాల్సిందే. అందరికి కనిపించేలా పెద్ద ఆసుపత్రి భవనం ఉన్నప్పటికి .. అక్కడ వైద్యం పొందడానికి వసతులు కరువు.. వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు కూడ లేవు.. వైద్యం అందించే డాక్టర్లు, సిబ్బందికి బయోమెట్రిక్ విదానం అమలు చేయడంలో యంత్రాంగం ఎందుకు విఫలం చెందుతున్నారో అర్థం కావడంలేదు. అందుకే ప్రభుత్వం స్పందించి దవాఖానాలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి
కొండమడుగు నర్సింహ , వ్యకాస జిల్లా కార్యదర్శి
పేదలకు అందించాల్సిన ప్రభుత్వ హస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, పోస్టులు, ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని వెంటనే భర్తి చేయాలి. పిహెచ్సీ కంటే అద్వాన్న స్థితిలో పెద్దాసుపత్రి నడుస్తుంది. వైద్యులు సమయపాలన పాటించేలాల పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారరు.