Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఉపాధ్యాయ వత్తిలో ఉంటూ పార్టీ బలోపేతానికి మీసాల ఉపేందర కృషి చేశారని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు అన్నారు. అనంతగిరిమండలపరిధిలోని అమీనాబాద్ గ్రామంలో ఉపాధ్యాయ సంఘం టీఎస్‌యూటీఎఫ్ నాయకులు ఉపేందర్ కొన్ని రోజుల కింద మృతి చెందారు.ఈ సందర్భంగా శనివారం ఆయనకు సంతాపసభను పార్టీ మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీరాములు మాట్లాడుతూ గ్రామంలో ఉపేందర్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు.టీఎస్యూటీఎఫ్లో చురుకుగా వ్యహరించరని గుర్తు చేశారు.ఆయన అకాల మరణానికి చింతిస్తున్నామన్నారు. అంతకు ముందు ఆయన చిత్రపటానికి శ్రీరాములు పూల మాలలేసి నివాళులర్పించారు.ఎంఈఓ చేతులమీదుగా రూ.70 వేల చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి వెంపటి శ్రీనివాస్,సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు, కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.