Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల వారిగా రూ.53,369 ఫెనాల్టీ
కోదాడరూరల్ :పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ ఉపాధిహామీ చట్టం సామాజిక తనిఖీ శనివారం నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లా గ్రామీణ అభివద్ధి అదనపు పథక సంచాలకులు జి సురేష్ మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామాలకు సంబంధించి 2018 డిసెంబర్ 1 వ తేదీ నుండి 2021 జనవరి 31 వరకు 1483 పనులకు గాను కూలీలకు చెల్లించిన రూ.572 92114, సామగ్రి కోసం చెల్లించిన రూ.93,56,782 రూపాయలు మొత్తం 6,66,48,896 సంబంధించి 12 వ విడత సామాజిక తనిఖీ మార్చి 23 నుండి ఏప్రిల్ 2 వతేదీ వరకు గ్రామాలలో సామాజిక తనిఖీ నిర్వహించామన్నారు.తనిఖీ నివేదికను మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహించామన్నారు.గ్రామాల వారిగా తనిఖీ బందం గుర్తించిన వివిధ సమస్యలకు గాను రూ.53,369 ఫెనాల్టీ రికవరీకి ఆదేశించారు.గ్రామాలలో ఉపాధిహామీచట్టంలో జరిగే పొరపాటు లు తిరిగి పునరావతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ కష్ణకుమారి, ఎంపీడీవో విజయశ్రీ, ఎంపీవో పాండురంగన్న, పీఎం ఏకాంబరం, ఎస్టీమ్ సాయి జ్ఞానేందర్, డీఆర్పీపీ కొండల్, ఎన్.వెంకన్న, బీఆర్పీఈలు నాగరాజు, నరేష్, నాగార్జున, సురేష్, శ్రీను, ప్రభాకర్,నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.