Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మాతా శిశు సంరక్షణ కోవిడ్ టీకాలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు. మండలపరిధిలోని కాసరాబాద గ్రామంలో శనివారం ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లా డారు.ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవా లన్నారు.మాతా శిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య పెంచాలని సూచించారు.45 ఏండ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని, ఆ దిశగా ఆరోగ్య కార్యకర్తలు ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నియమనిబంధనలు పాటించాలన్నారు.జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా శిక్షణా అధికారి వెంకట పాపిరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సంధ్య పాము, భాస్కరరాజు భూతరాజు సైదులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.