Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
బడ్జెట్లో స్థానిక సంస్థలకు రూ.500 కోట్లు కోటాయించినందుకు ఎంపీటీసీల ఫోోరం జిల్లా అధ్యక్షులు సీపీఐ(ఎం) నాయకురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె హైదరాబాదులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల నిధుల కేటాయింపునకు కషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మరిన్ని నిధులను కేటాయించి మండలంలో వారికి సముచిత స్థానం ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో జిల్లా మండల పరిషత్తులకు కేటాయించిన నిధుల విడుదలకు సహకరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జెడ్పీ ఫ్లోర్ లీడర్ , జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కుడుదుల నగేష్ సంఘం అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లోని ఆమె కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలకు మండల పరిషత్‌లకు నిధుల కేటాయింపునకు సహకరించిన ఆమెకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ ,పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, సంఘ సభ్యులు పాల్గొన్నారు .