Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ తరహాలో పోరాటానికి సిద్ధం కావాలి
- పాదయాత్ర బృందం సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికు చట్టాలను కార్పొరేట్ శక్తుల కోసం నాలుగు కోడ్లుగా విభజించిందని, నల్లచట్టాలను తీసుకొచ్చి కార్మిక, కర్షక వర్గాలకు తీరని అన్యాయం చేసిందని పాదయాత్ర బృందం సభ్యులు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి విమర్శించారు. పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను బీజేపీ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి మోడీ నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించి, కార్మికులు యాజమాన్యాలకు అనుకూలంగా బానిసలుగా పని చేసే చట్టాలను తీసుకువస్తున్నారన్నారు., చట్టాలు గనుక అమలైతే తెల్ల దొరల పాలనను నుంచి కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడం, స్వేచ్ఛా మార్కెట్ల పేరుతో బడా వ్యాపారస్తులకు అనుకూలంగా చట్టాలు చేసిందన్నారు. ప్రజలందరూ అవగాహన కలిగి ఢిల్లీ తరహాలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.