Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని కాల్వలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం)యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జన చైతన్య పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం వీరవెళ్లి గ్రామంలోని బునాదిగాని కాల్వ పనులను పాదయాత్ర బందం సభ్యులతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. 2005 సంవత్సరంలో ప్రారంభమైన బునదిగాని కాల్వ పనులు ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత టీిఆర్ఎస్ ప్రభుత్వం కాల్వ పనులను పూర్తి చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఈ కాల్వ మక్తఅనంతరం నుంచి బీబీనగర్ భువనగిరి మీదుగా అడ్డ గూడూరు మండలం ధర్మారం వరకు వెళుతుందని అన్నారు. ఈ కాల్వ ఎప్పుడు ప్రారంభమైంది.. ఎన్ని నిధులు కేటాయించారు.. కాల్వ పనులు ఎందుకు ఆలస్యం జరిగింది.. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఎంతమందికి అందించారు.. వారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వా యంత్రాంగాన్ని ప్రశ్నించారు. బునాదిగాని కాల్వ తో పాటుగా ధర్మా రెడ్డిపల్లి, పిల్లాయిపల్లి, బొల్లేపల్లి, వడపర్తి కత్వతో పాటు జిల్లాలోని చిన్న నీటి కాల్వల పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు సాగునీరు అందించాలని అందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి పనులు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి టైం బాండ్ లేకుండా తూతూ మంత్రంగా పనులు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 23న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రస్తుతం 308 కిలోమీటర్లు పూర్తిచేసుకొని దిగ్విజయంగా ముందుకు సాగుతోందన్నారు. వివిధ గ్రామాల్లో ప్రజలు, రైతులు అనేక రకాల సమస్యలపై తమకు వినతి పత్రాలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, కల్లూరి మల్లేశం, బట్టు పల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గిరిజన సంఘం నాయకులు రమేష్ నాయక్, భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, పట్టణ కార్యదర్శి మాయ కష్ణ, నాయకులు హనగంటి వెంకటేష్, వనం రాజు,పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి పాల్గొన్నారు.
మండలంలో అభివృద్ధి శూన్యం
పాదయాత్ర రథసారధి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
మోటకొండూర్ : నూతనంగా ఏర్పడిన మండలంలో అభివద్ధి శూన్యమని పాదయాత్ర బృందం రథసారధి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. సోమవారం మంండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తుందో బహిరంగ చర్చ ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు తప్ప ప్రజలకు అదనంగా ఒరిగిందేమీ లేదన్నారు. నూతన మండలాలుగా ఏర్పాటు చేసి ఎందుకు అభివద్ధి చేయడంలేదని ప్రశ్నించారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్క భవనాలు ఒక్కటైనా నిర్మించారా అని ప్రశ్నించారు. మండల కేంద్రం నుండి వంగపల్లి పోయే రోడ్డు ను డబల్ రోడ్డుగా మార్చాలని, వంగపల్లి హైవే రోడ్డు పై అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల కేంద్రం కలుపుకొని అన్ని గ్రామ పంచాయతీలకు లింకు రోడ్లను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్నాయని ఈ 13 రోజుల కాలంలో అనేక సమస్యల్ని గుర్తించామన్నారు ఈ 13 రోజులగా ఘనమైన స్వాగతాల మధ్య పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు . ఈ పాదయాత్ర ద్వారా వచ్చిన అనేక సమస్యలపై పెద్ద ఎత్తున జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్థానికంగా ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు . అనంతరం మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలానికి చెందిన పలువురు పాదయాత్ర బదం దష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బదం సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం ,బట్టుపల్లిఅనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా నాయకులు ధరావత్ రమేష్ నాయక్, ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, మండల కార్యదర్శి బోలగాని జయరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కందాల ప్రమీల, డబ్బీకార్ మల్లేష్ ,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, మండల కార్యదర్శి గాధగాని మాణిక్యం, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కొల్లూరు ఆంజనేయులు, కొల్లూరి మహేందర్ ,పట్టణ కార్యదర్శి. పోతుగంటి బిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, ఆనగంటి వెంకటేష్,దయ్యాల నరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వనం రాజు,తదితరులుపాల్గొన్నారు.