Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
పాఠశాలలు తిరిగి తెరిచే వరకు ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు,బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు సిబ్బంది ఆదుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన కుటుంబానికి నెలకు 2000 ఆర్థిక సహాయంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోల బియ్యం పాఠశాలలు తెరిచే వరకు ఉచితంగా అందించడం పై శుక్రవారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఇతర ఉన్నత అధికారులతో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధి విధానాలపై చర్చించారు.కరోనా కష్టకాలంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి ప్రయివేటు స్కూల్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు మానవీయ దక్పథంతో అండగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 10500 ప్రయివేటు పాఠశాలలకు సంబంధించి 1,45,000 ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్క ప్రైవేట్ ఉపాధ్యాయుడు సిబ్బందిని గుర్తించి ప్రభుత్వ సహాయాన్ని అందించాలని కోరారు. ప్రయివేటు ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి బియ్యం , పంపిణీ పై విధానాన్ని పర్యవేక్షించాలని అధికారులను కోరారు.రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో ఫ్రంట్‌లైన్ వారియర్స్ గా పని చేస్తున్న మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికుల నుంచి మున్సిపల్ కమిషనర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు తీసుకునేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామాలలో పంచాయతీ సిబ్బంది వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, విద్యాశాఖ కార్యదర్శి చిత్ర రామచంద్రన్,అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈవో చైతన్య జైని, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపి కష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మ రావు పాల్గొన్నారు.