Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన గుర్రంపోడు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..మండలంలోని మొసంగి గ్రామానికి చెందిన హను మాన్రెడ్డి తన ఇంట్లో అనుమతి లేకుండా రూ.30 లక్షల విలువైన మద్యాన్ని నిల్వ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.