Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది వివరాలు ఉద్యోగ ప్రాతిపదికపై సేకరించాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు.శుక్రవారం కరోనా ఉధతి నేపథ్యంలో పాఠశాలలు తాత్కాలికంగా పడినందున ప్రభుత్వం ప్రయివేటు ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి రెండు వేల ఆర్థిక సహాయం 25 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ గుగుల్మీట్ద్వారా అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి , కి మియా నాయక్, డీఈవో చైతన్య జైని మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.ప్రయివేటు ఉపాధ్యాయుల బోధనేతర సిబ్బంది వివరాలను నిర్ధారించుకొని ఖచ్చితమైన నివేదిక రూపొందించాలని మండల విద్యాధికారులను ఆదేశించారు. 40 ఏండ్లు పైబడిన వివిధ శాఖలలో పనిచేస్తున్న వారందరూ వాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో మ్యాచింగ్, బ్యాచింగ్ పద్ధతిలో రద్దీని నియంత్రిస్తూ ఏరోజుకారోజు యాక్షన్ తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్లో కేవలం పోలీస్ శాఖ తప్ప మిగిలిన ప్రాంతాల వారిగా వెనుకబడి పై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అధికార యంత్రాంగం వ్యాక్సిన్ గురించి అవగాహన కలిగిస్తూ మనమే తీసుకోకపోవడంపై ఆయా శాఖల అధికారులను మందలించారు.రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు మున్సిపల్, ఐసీడీఎస్ శాఖల నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని ఆదేశించారు. సామాజిక బాధ్యతగా కరోన వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు.