Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి: ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీపీఎం మోహన్ రెడ్డి పేర్కొన్నారు .ఆదివారం మండల పరిధిలోని అక్కినపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని , ధాన్యంలో తాలు,తేమ శాతం లేకుండా చూసుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మాదసు చంద్ర శేఖర్, ఈద మాధవి ఎంపీటీసీ సావిత్రి కుమారస్వామి, ఏ పీఎం వోగోటి. కష్ణ , సీసీ శ్రీనివాసులు,జ్యోతి,ఉప సర్పంచ్ నిర్మల వివో అధ్యక్షురాలు రాణి, వీఓఏ, ఉపెంద్ర సత్యనారాయణ రెడ్డి,దశరద,జనార్దన్,రెడ్డి తదిరులు పాల్గొన్నారు.