Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజలందరి ఆశీర్వాదంతోనే నకిరేకల్ మున్సిపాలిటీ అభివద్ధి చెందుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మున్సిపాలిటీ 7వ వార్డులో మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నకిరేకల్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లోనూ అభివద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి నుండి తనకు నకిరేకల్ పట్టణంపై ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆ చొరవతోనే 11 కోట్ల రూపాయలతో పట్టణంలో అనేక అభివద్ధి కార్యక్రమాలను నిర్వహించామన్నారు, సీఎం కేసీిఆర్ , మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో మరో 4 కొట్ల రూపాయాల నిధులు మంజూరు చేశామన్నారు. ఆయన వెంట టీిఆర్‌ఎస్ నాయకులు మాధ నగేష్ గౌడ్, నడికుడి వెంకటేశ్వర్లు ,రాచకొండ వెంకన్న, సైదా రెడ్డి, పల్లె విజరు, చెవు గొని శంకర్ పాల్గొన్నారు.