Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ -కట్టంగూరు
గతేడాది పని చేసిన కూలీల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో జరుగుతున్న ఉఫాది హమీ పనులను ఆయన పరిశీలించారు. కూలీల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతేడాది ఉపాధి హామీ పని చేసిన వారి బకాయిలు ఆరు వారాల డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారన్నారు. పని చేసిన పదిహేనురోజుల్లో వేతనాలు చెల్లించాలని, చట్టంలో ఉన్న అమలు కావడం లేదని అందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఉపాధి హామీ పనిదినాల్ని 200 రోజులకు పెంచి, రూ. 600 వేతనం ఇవ్వాలని, కరోనా కాలంలో 16రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. గకరోనా సాయం కింద రూ. 7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుడుగుంట్ల రామకష్ణ, మండల కమిటీ సభ్యులు దండెంపల్లి శ్రీను, కూలీలు చలకపల్లి రాణమ్మ, పెరిక శారద, దాసరి లక్ష్మయ్య, నిమ్మనగోటి సత్తయ్య గుడుగుంట్ల మనెమ్మ, బీసం మంగమ్మ. గోలుసుల సైదమ్మ, దండేంపల్లి అంజయ్య, గుడుగుంట్ల పద్మ,లలితా, ఊర్మిళ పాల్గొన్నారు.