Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని పాదయాత్ర బృందం సభ్యులు కోమటిరెడ్డి చంద్రా రెడ్డి, బట్టుపల్లి అనురాధ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. చట్టాల మార్పుతో కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. వారికి కనీస వేతనాలు అందడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి పేదలు కొనలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.