Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- 170 గ్రామాల్లో 875 కిలోమీటర్లు పూర్తి
- బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం
- జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా సమగ్రాభివద్ధి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర రామన్నపేటలో మార్చి 23వ తేదీన ప్రారంభమై సుమారు 15 మండలాల్లో పూర్తి చేసుకుని నేడు జిల్లాకేంద్రంలో ముగుస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తెలిపారు. పాదయాత్ర భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివద్ధి లక్ష్యంగా చేపట్టిన జనచైతన్య పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించిందన్నారు. ప్రజలు తమ సమస్యలపై పాదయాత్ర బందానికి వినతి పత్రాలు అందజేసినట్టు తెలిపారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని కోరుతూ వేల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కోవిడ్ విజంభిస్తున్నందున పాదయాత్రను తగ్గించినట్లు తెలిపారు. పాదయాత్ర షెడ్యూల్ తగ్గించడం వల్ల తుర్కపల్లి, బొమ్మలరామారం మండలంలో పాదయాత్ర చేయలేకపోయామన్నారు. ఆ మండలాల్లో పాదయాత్ర భవిష్యత్తులో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పాదయాత్ర సుమారు 875 కిలోమీటర్లు 170 గ్రామాలలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. పాలకులు సాగు , తాగు నీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి, రైతులను మోసం చేస్తోందన్నారు. కార్మికుల వ్యతిరేక చట్టాలను తీసుకొని కార్మికులను కట్టుబానిసలా చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో బొల్లేపల్లి, బునాదిగానే , పిల్లాయిపల్లి, ధర్మ రెడ్డి పల్లి, వడపర్తి కత్వ లాంటి చిన్న నీటి పారుదల ప్రాజెక్టులను విస్మరించిందన్నారు. జిల్లాకు కాళేశ్వరం నీరు అందిస్తామని చెప్పి ఇంతవరకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించని అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. జిల్లాలో పాదయాత్రకు విశేష ఆదరణ లభించిందని, స్వాగతం పలికిన ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2:30 గంగట నిమిషాలకు జిల్లా సమగ్రాభివద్ధిపై పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతులను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరుకానున్నట్టు తెలిపారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాలు అభిమానులు బహిరంగ సభకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గిరిజన నాయకులు రమేష్ నాయక్, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, శాఖ కార్యదర్శి కొండా అశోక్, నాయకులు పల్లెర్ల అంజయ్య, వడ్డెబోయిన వెంకటేశం, అన్న గంటి వెంకటేశం, కళాకారుల బందం, లతీఫ్, షరీఫ్ పాల్గొన్నారు.