Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
సాగర్ ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలకు గాను 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.మొత్తం 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.వీరిలో పురుషులు 1,09,228 మంది, మహిళలు 1,11,072 మంది ఉన్నారు. అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆయా పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్‌సింగ్ ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.మొత్తం 346 కేంద్రాలకు గాను 3145 మంది సిబ్బంది విధులు నిర్వహించ నున్నారు.ఎన్నికలకు గాను 130 మంది సూక్ష్మపరిశీలకులను నియమించారు.వెబ్‌కాస్టింగ్‌కు 210, బీఎల్వోలు 293, ఆరోగ్య సిబ్బంది 710 మంది నియమించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మాస్క్ ధరించి పోలింగ్‌కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.కేంద్రాల వద్ద శాని టైజర్‌ను అందుబాటులో ఉంచనున్నారు.పెద్దవూర మండలంలో అత్యధికంగా 44,783 మంది ఓటర్లుండగా అత్యల్పంగా మాడ్గులపల్లి మండలంలో 7233 మంది ఉన్నారు.కాగా ఉపఎన్నిక బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నారు.