Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో 20 వార్డుల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి సహ కరించిన అధికారులు, పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ఇన్చార్జిలక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన చిరుమర్తి
మున్సిపాలిటీ జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని 20 వార్డులకు గాను 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.