Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-భువనగిరి రూరల్
కరోనా నేపథ్యంలో వికలాంగులకు ప్రతినెలా రూ.10 వేల ఆర్ధిక సాయం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఏవో నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మాటూరి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులందరికీ ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ 35 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కోరారు. మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాలన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లపల్లి స్వామి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ కొత్త లలిత, జిల్లా కమిటీ సభ్యురాలు కృషి పద్మ తదితరులు పాల్గొన్నారు.