Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట: కరోనా బారిన పడ్డ కార్మికులకు నెల రోజుల వేతనం, మందులు ఇచ్చి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు సేఫ్టీ మెజర్స్, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రెండేండ్లుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిగే సోములు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మండలాధ్యక్ష కార్యదర్శులు ఎమ్‌డి.ఇలియాస్, తెల్ల శేఖర్, గోల్లురి నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్టల శ్రీనివాస్, గోరిగె ఆది మల్లయ్య, మల్లేశం, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.