Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
నకిరేకల్ పురపోరులో కారు అభ్యర్థులు 11 మంది జోరు ప్రదర్శించారు. ఆరుగురు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించగా ఇరువురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒకటో వార్డు లో స్వతంత్ర అభ్యర్థి కందాల బిక్షం రెడ్డి( 426)కాంగ్రెస్ అభ్యర్థి ముద్దం విజరు(238) పై 188 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు .రెండవ వార్డులో టీిఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ సునీల్ కుమార్ (590)ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గుండు నాగరాజు(194) పై 296 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మూడవ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన పొడుగు స్వాతి(472) ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి తడిసిన శ్రీనివాసరెడ్డి(213)పై 259 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గాజుల సుకన్య (535)టీఆర్ఎస్కు చెందిన యాల్లపు రెడ్డి శిరీష(240) పై 295 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించింది.ఐదవ వార్డులో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వంట పాక సోమలక్ష్మిి(418) టిఆర్ఎస్ అభ్యర్థి వంట పాక ప్రసన్న(303) పై 115 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించింది. ఆరో వార్డు లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మట్టి పల్లి కవిత(498) టీిఆర్ఎస్ అభ్యర్థి మంగినపల్లి ధనమ్మ(477) పై 21 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. ఏడవ వార్డులో టీఆర్ఎస్ కు చెందిన కొండ శ్రీను(413) కాంగ్రెస్ అభ్యర్థి చింతల శ్రీనివాస్(269) పై 114 ఓట్లతో విజయం సాధించారు. 8వ వార్డు లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పన్నాల పావనిి(523) టీఆర్ఎస్ అభ్యర్థి సామ బాలమ్మ(427) పై 96 ఓట్లతో గెలుపొందారు. 9వ వార్డులో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చెవు గొని రజిత(555) టీిఆర్ఎస్ అభ్యర్థి నోముల రేణుక(274)పై 293 ఓట్లతో ఆధిక్యతను ప్రదర్శించింది. పదో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి చెవు గొని అఖిల(508) కాంగ్రెస్ అభ్యర్థి దేవులపల్లి సువర్ణ( 331)పై172 ఓట్లు ఆధిక్యతను కనబరిచింది. 11వ వార్డు లో టిఆర్ఎస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమారాణి( 497) కాంగ్రెస్ అభ్యర్థి కందాల ప్రవీణ(361) పై 136 ఓట్ల మెజారిటీ సాధించింది. 12 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు వెంకన్న(357) స్వతంత్ర అభ్యర్థి మెడ ఎల్లమ్మమ(271)పై 86 ఓట్ల మెజారిటీ సాధించింది. 13వ వార్డు లో టిఆర్ఎస్ అభ్యర్థి పోతుల సునీత( 481)ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పన్నాల వరలక్ష్మి(184) పై 297 ఓట్ల మెజార్టీ సాధించింది. 14వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం లక్ష్మీనరసింహస్వామి(389) కాంగ్రెస్ అభ్యర్థి బ్రహ్మదేవ రమేష్(183) పై 206 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 15 వార్డులో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి యా సారపు లక్ష్మి(438)టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ సహనాజ్(280) పై158 ఓట్ల ఆధిక్యత కనబరిచింది. 16 వ వార్డులో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఘర్ష కోటి సైదులు(426) కాంగ్రెస్ అభ్యర్థి కొండా శంకర్ గౌడ్(281) పై 175 ఓట్లతో గెలుపొందారు. 17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె విజరు(512) ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి తిరుపతయ్య(419) పై 93 ఓట్ల ఆధిక్యత ప్రదర్శించాడు. 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దైదా స్వప్న(726) టీఆర్ఎస్ అభ్యర్థి వంటే పాక సుందర్(150) పై 576 ఓట్లతో విజయం సాధించారు. 19 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ శ్రీనివాస్(508) కాంగ్రెస్ అభ్యర్థి గుణ గంటి రాజు(159) పై 349 ఓట్లతో గెలుపొందారు. 20వ వార్డు లో టిఆర్ఎస్ అభ్యర్థి చౌగొని రాములమ్మ(484) ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గంగాధర పద్మావతి(475) పై 9 ఓట్లతో గెలుపొందారు.