Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలపరిధిలోని బండమీది చందుపట్ల గ్రామంలో కొన్ని నెలలుగా మురికి కాలువలు తీయకపోవడంతో దుర్వాసన రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఆ కాలువలకు పక్కనే మంచినీటి వాటర్‌ట్యాంక్ ఉంది. గ్రామంలోని కనీసం 1/2 వంతు ప్రజలు నీరును ఆ ట్యాంక్ నుండి తీసుకెళ్తుంటారు.ఆ ట్యాంక్ వాటర్‌ని ఎక్కువగా ఎస్సీ,ఎస్టీ, బీసీ ప్రజలు వాడుతుంటారు.ఈ విషయం సర్పంచ్‌కి ఎన్నిసార్లు చెప్పినా ఆ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్న మురుగు కాలువలో పడిన మట్టిని చెత్తను తీయకపోవడంతో దుర్వాసన వస్తుండడంతో అది గమనించిన యువకులు మురుగు కాలువ స్వచ్ఛందంగా శుభ్రపరిచారు.అనంతరం యువకులు మాట్లాడుతూ గ్రామంలోని కొన్ని వీధులలో మురుగుకాలువలు పూడికలు తీయకకుండా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయన్నారు.అధికారులు స్పందించి వెంటనే గ్రామంలోని మురికికాల్వలను శుభ్రపరచాలని కోరారు.విషయం తెలుసుకున్న ఎంపీఓ గోపి గ్రామాన్ని సందర్శించారు.వీధులను పరిశీలించారు.వెంటనే వీధులను, మురుగుకాలువలను పారిశుధ్యకార్మికులతో శుభ్రం చేయించాలని సర్పంచ్‌ని, పంచాయతీ కార్యదర్శికి సూచించారు.ఈకార్యక్రమంలో భాషపంగు సునీల్, ఎర్రసురేష్, ఎర్రస్టాలిన్, భిక్షం, వంశీ, బన్నీ, సన్నీ పాల్గొన్నారు.