Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
రాష్ట్ర సరిహద్దు మండలపరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద లాక్డౌన్ సందర్భంగా హైదరాబాద్ నుండి సొంత ఊర్లకు వెళ్లే వారి వాహనాల రద్దీ పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సమయం ఉండడంతో పెద్దఎత్తున తమ సొంతగ్రామాలకు వెళ్లే వాహనాలు ఆ సమయం లోపల చేరుకున్నాయి.10 గంటలు దాటిన అనంతరం పోలీసులు పగడ్బందీగా లాక్డౌన్ అమలు చేశారు.చెక్‌పోస్టు వద్ద గూడ్స్ వాహనాలను, వైద్యం కోసం వెళ్లే వాహనాలను, ఈ పాస్ ఉన్న వాహనాలను పరిశీలించి పంపించారు.