Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ సత్యనారాయణ అన్నారు.బుధవారం మండలకేంద్రంలో లాక్డౌన్ వీధులలో భాగంగా గస్తీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తమ పనులు ముగించుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలన్నారు.అన్ని దుకాణాలను బంద్ చేయాలన్నారు.వైద్య అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావొద్దన్నారు.ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే ఆ వ్యక్తులకు పోలీస్పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఈ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జారీ చేస్తామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
హుజూర్నగర్ : పట్టణంలో పోలీసులు సంపూర్ణంగా అమలు చేశారు. ప్రభుత్వం తెలియ జేసిన విధంగానే ఉదయం 10 గంటలకు దుకా ణాలను మూసివేయించారు.ఈసందర్భంగా ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. అనవ సరంగా రోడ్లపైకి రావద్దని ప్రతి ఒక్కరూ తప్పక మాస్కు ధరించడంతో పాటు సామాజికదూరం పాటించాలన్నారు.లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం మినహాయింపులూ ఇచ్చిన వ్యక్తులు తప్ప మిగతా వ్యక్తులు ఇంట్లోనే ఉండి లాక్డౌన్ కొనసాగించాలన్నారు.
అర్వపల్లి : మండలకేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలీసులు దుకాణాలను మూసి వేయించారు.మరోవైపు దూరం వెళ్లే ప్రజలు కూడా బస్సులు రాకపోవడంతో ఇబ్బందులకు గుర య్యారు.టూవీలర్ వాహనాలపై వెళ్లే వారు లాక్డౌన్ మూలంగా కొంత ఇబ్బందికి లోనయ్యారు. మండలంలో ఉపాధిపనులు కొనసాగాయి.
చివ్వెంల : మండలకేంద్రంలో ఎస్సై విష్ణుమూర్తి తన సిబ్బందితో దుకాణాలను మూసివేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నియమాలను ప్రజలు, వ్యాపారులు కచ్ఛితంగా పాటించాలన్నారు.మాస్క్‌లు ధరించడంతో పాటు సామాజికదూరం పాటించాలన్నారు.
చింతలపాలెం: మండలకేంద్రంలో ఉదయం 10 గంటలకు అన్ని దుకాణాలను మూసి వేయించారు.ముక్య్తాల, పులిచింతల ప్రాజెక్టు సరి హద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ఎవరూ రాకుండా పోలీసులు చూస్తున్నారు.ఎస్సై మహేందర్‌రెడ్డి ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చండూరు: ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో వ్యాపార సంస్థ దుకాణాలను ఉదయం 10 గంటలకు మూసివేశారు.దీంతో రోడ్లపైన జనాలు ఎవరూ కనిపించలేదు.దీంతో రోడ్లన్నీ బోసిపోయి నిర్మానుష్యంగా మారాయి.సాయంత్రంవేళలో పోలీ సులు, మహిళా పోలీసులు వాహనదారులకు ,రోడ్లపైకి వచ్చిన వారికి పలు సూచనలు, కౌన్సెలింగ్ చేశారు.