Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాల :మండలకేంద్రంలో సీపీఐ(ఎం)సానుభూతిపరుడు, సింగిల్ విండో రిటైర్డ్ సీఈఓ రచ్చా భద్రకాళి(68)అనారోగ్యంతో బుధవారం మతి చెందారు.ఆయన భౌతికాయాన్ని పార్టీ మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.భద్రకాళి చిన్నతనంలోనే కమ్యూ నిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని చెప్పారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికి కడదాకా పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు.పేద కుటుంబంలో జన్మించినా పార్టీ ఆశయాలకు కోసం నికరంగా పనిచేసి పేరు సంపాదించుకున్నారని చెప్పారు. మునగాల, తాడువాయి పీఏసీఎస్‌ల్లో సుమారు రెండు దశాబ్దాల పాటు సీఈఓగా పనిచేసి నీతి నిజాయితీగా రైతాంగానికి సేవలందించారని తెలిపారు.పదోన్నతిపై జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు మునగాల బ్రాంచిలో పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు.మతునికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.భౌతికాయాన్ని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డీివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్ సందర్శించారు.కుటుంబసభ్యులకు ప్రగాడసానుభూతి తెలిపారు.