Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పర్యవేక్షించిన కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీనారాయణరెడ్డి
నవతెలంగాణ- భువనగిరి
ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా బుధవారం భువనగిరి ప్రజలు, వ్యాపారవేత్తలు పాటించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వ్యాపార సంస్థలు కూరగాయల షాపులు ఇతర వాణిజ్య సంస్థలు నడిచాయి. పది గంటల నుండి లాక్‌డైన్ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ , డీసీపీ నారాయణరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఉదయం9 గంటల తర్వాత పోలీసులు వివిధ జాతీయ రహదారులపై పట్టణంలో ముందస్తు బందోబస్తు నిర్వహించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. వైన్స్‌ల వద్ద పెద్ద ఎత్తున రెండు లైన్ల మందుబాబులు నిలుచున్నారు.
వైఎల్‌ఎన్‌ఎస్ బ్యాంక్ వేళల్లో మార్పు
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బ్యాంకులు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. బ్యాంకు ఖాతాదారులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్ చెన్న వెంకటేశం తెలిపారు.
రామన్నపేట : కరోనా మహమ్మారి విస్తతం అవుతుండడంతో ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మూలంగా బుధవారం మండల కేంద్రంలోని సుభాష్ రోడ్, సుభాష్ సెంటర్, నెహ్రూ స్ట్రీట్ గాంధీ చౌక్ పాత బస్టాండ్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉండడంతో ఆ సమయంలో షాపులు తెరిచి ఉండడం నిత్యావసర వస్తువుల కోసం, ఇతర పనుల కోసం ప్రజలు బయటికి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి, సందడిగా కనిపించాయి.
జిల్లా సరిహద్దు చెక్ పోస్టును సందర్శించిన డీసీపీ నారాయణరెడ్డి
లాక్డౌన్ సందర్భంగా మండల కేంద్రంలోని చిట్యాల రోడ్లో యాదాద్రి భువనగిరి - నల్గొండ జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం డీసీపీ నారాయణరెడ్డి సందర్శించి స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనలను ప్రజలు, వాహనచోదకులు పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఎవరిని ఉపేక్షించొద్దని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు.
మోత్కూరు : కరోనా సెకండ్ వేవ్ కేసులు ఉధతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా బుధవారం మున్సిపల్ కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం 10 గంటల నుండి వ్యాపారులు దుకాణాలను పూర్తిగా మూసివేశారు. ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన సేవలు కొనసాగాయి. ఎస్ఐ జి.ఉదరు కిరణ్ సిబ్బందితో అంబేద్కర్ చౌరస్తాలో పికెటింగ్ నిర్వహించి రాకపోకలపై పర్యవేక్షణ కొనసాగించారు.
భువనగిరిరూరల్ : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ బుధవారం మండలంలో ప్రారంభం కాగా భువనగిరి రూరల్ పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు.లాక్ డౌన్ సమయంలో వచ్చిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భువనగిరి గజ్వేల్ రోడ్డు లోని వడపర్తి వద్ద, భువనగిరి చిట్యాల రోడ్డులో అనాజిపురం స్టేజి వద్ద, రాయగిరి మోత్కూర్ రోడ్డు కోడూరు వద్ద వాహనాలను తనిఖీ చేసినట్టు రూరల్ ఎస్ఐ సైదులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు విధిగా పాటించాలని లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
భూదాన్‌పోచంపల్లి : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలకేంద్రంలో సంపూర్ణంగా కొనసాగింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ విధించడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సైదిరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టరమైన చర్యలు తీసుకుంటామన్నారు.10 గంటల లోపు మాత్రమే ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లాలని సూచించారు.
మోటకొండూర్: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పకడ్బందీగా ఎస్సై డి. నాగరాజు ఆధ్వర్యంలో సంపూర్ణ లాక్ డౌన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై డి. నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించి ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
ఆలేరుటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలేరు మున్సిపల్ కేంద్రంలో పటిష్ట బందోబస్తు మధ్యన పోలీసులు లాక్డౌన్ నిర్వహించారు .హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఇండ్లల్లోనే ఉండి పోలీసులకు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు .ఉదయం 6గంటల నుండి 10గంటలవరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చిన తమకు కావాల్సిన వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, సీఐ జీ నర్సయ్య, ఎస్సై ఈ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : మండలకేంద్రంలో లాక్డౌన్ వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు చెక్‌పోస్టు వద్ద నిబంధనలు అమలు చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు సడలింపు ఉండడంతో ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. గుట్టపై కూడా నిర్మాణుష్యంగా మారింది.
చౌటుప్పల్ :ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పట్టణకేంద్రంలో పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ విధించడంతో ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు సడలింపు ఉండడంతో ప్రజలు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు.