Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు అప్రమత్తంగా ఉండండి
- మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ
నవతెలంగాణ నకిరేకల్
మండలంలో ఉన్న చెరువులను సమీప రైతులు కబ్జా చేస్తున్నా అధికారులు అలసత్వం వహించడం సరికాదని,వెంటనే అధికారులు కబ్జాకు గురైన చెరువులను గుర్తించి హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్‌రావు ఆదేశించారు.బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాలలోని చెరువులను సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.కోవిడ్ వ్యాక్సిన్ కేవలం ఓగోడు పీహెచ్‌సీలోనే కాకుండా జాతీయ రహదారి ఇవతలవైపు ఏదైనా ఊరిలో టీకా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.ఉపాధి కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు.ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.