Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదంలో ఆటో డ్రైవర్ మతి
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఆటో ఢ కొనగా డ్రైవర్ మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి మండలంలోని కొయ్యలగూడెం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ కొయ్యలగూడెం గ్రామంలో ఉన్న బ్రిడ్జి పై ఎలాంటి సిగల్ వేయకుండా రోడ్డు పక్కన ఆగి ఉంది. ఇదే సమయంలో దండుమల్కాపురం గ్రామానికి చెందిన బుర్ర చంద్రశేఖర్(45 )చౌటుప్పల్ నుండి దండుమల్కాపురం వెళ్తూ ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢ కొట్టాడు. ఛాతీలో, చేతులకు బలమైన గాయాలయ్యాయి.చికిత్స నిమ్మిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు. మతుడి భార్య బుర్ర శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నారబోయిన నవీన్ బాబు తెలిపారు.-