Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి మండలంలో 2021- 22 సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల ద్వారా రూ.78.73 మూడు లక్షలతో చేపట్టిన పనులకు ఆమోదం తెలిపినట్టు ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు.రూ. 78.73 లక్షల నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు. నిధులు రాగానే నిధులు కేటాయించినా, ఆమోదం పొందిన గ్రామాలలో పనులు చేపట్టడం చేపట్టనున్నట్టు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : ఎంపీటీసీలు
భువనగిరి మండలంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని పలువురు ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రధానంగా 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి బ్యాంకులలో నగదు జమ చేయడం లేదని నందనం ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు ఆరోపించారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సిన్లు అందరికీ వేయాలని ఎంపీటీసీ రసాల మల్లేష్ యాదవ్, పాశం శివానంద్ లు కోరారు. మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ స్పందిస్తూ అన్ని గ్రామాల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్లను వేసినట్టు తెలిపారు. రెండో వ్యాక్సిన్కూడా వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. . వ్యవసాయ శాఖ ,ఉపాధి హామీ పనులు, సమభావన సంఘాల శాఖ, రాజు శాఖలపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు హాజరు కాలేదు. ఈ సమావేశంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నలమాస రమేష్ గౌడ్, ఎంపీడీవో నాగిరెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు సామల వెంకటేష్, గునుగుంట్ల కల్పన శ్రీనివాస్,కంచి లలితా మల్లయ్య, ఉడుత శారద ఆంజనేయులు యాదవ్, గడ్డమీది చంద్రకళ వీర స్వామి గౌడ్, సర్పంచ్ యాదగిరి, మండల స్థాయి అధికారులు ఏవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏఈ ప్రసాద్, ఏపీవో బాలస్వామి, ఏపీఎం గంట లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.