Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుందరయ్య జీవితం నేటి యువతరానికి ఆదర్శం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లులక్ష్మీ
నవతెలంగాణ-సూర్యాపేట
పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పేదల పెన్నిధి పుచ్చలపల్లి సుందరయ్య అసాధారణ పోరాట యోధుడని,ఆయన జీవితం నేటి యువతరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ అన్నారు.బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో సుందరయ్య 36వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ కష్టజీవుల పక్షాన, కార్మికుల పక్షాన వ్యవసాయ కార్మికులకు జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారన్నారు.దేశంలో శ్రామికజనం కోసం మార్క్స్ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని 60 ఏండ్ల పాటు ఉద్యమాలు నిర్వహించి మచ్చలేని మహానాయకునిగా పేరు తెచ్చుకున్నా రన్నారు.తన సొంత గ్రామంలో కుల,మత అసమానతలను తొలగించేందుకు హరిజనులతో కలిసి సహపంక్తి బోజనాలను ఏర్పాటు చేశారన్నారు.వ్యవసాయకార్మిక సంఘాన్ని నిర్మించి భూమి,కూలీ పోరాటాలకు బాసటగా నిలిచారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతుంటే తానే స్వయంగా నిత్యావసర వస్తువులు తెచ్చి పేదలకు ఇంటింటికి వెళ్లి తక్కువధరకు అమ్మి పేదల ఆకలిని తీర్చారని గుర్తుచేశారు.ఆయన ఒక ప్రజానాయకునిగా, విప్లవకారునిగా ఎదిగి మరణించే వరకు నీతి నిజాయితీగా,ఆదర్శంగా జీవించా రన్నారు.ఒక పక్క స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే మరో పక్క కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా దున్నే వానికే భూమి కావాలని వెట్టి చాకిరి పోవాలని జరిగిన మహత్తర తెలంగాన పోరాటానికి కీలక నాయకుడిగా వ్యవహరించారని అభివర్ణించారు.పార్లమెంట్ సభ్యునిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సాదాసీదాగా ఉండి ప్రజా సమస్యలపై పరిజ్ఞానంతో ముక్కు సూటిగా చట్ట సభలలో ప్రజావాణిని వినిపించారని వెల్లడించారు.రాజకీయాలలో పని చేస్తున్న నేటి యువతరం ఆయన నిరాడంబరత,నీతి నిజాయితీ విలువలను ఆదర్శాలుగా తీసుకొని పని చేయాలని పిలుపునిచ్చారు. సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేడు కరోనా మహమ్మారితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలను విస్తతంగా చేపట్టాలన్నారు.కరోనా నుండి ప్రజలను రక్షించుకునేందుకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టియాదగిరిరావు,జిల్లా కమిటీ సభ్యులు కోటగోపి, ఎల్గూరి గోవింద్,మేకనబోయినశేఖర్, జె.నర్సిం హారావు, ధనియాకుల శ్రీకాంత్, ఐద్వా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జంపాల స్వరాజ్యం,మేకన బోయిన సైదమ్మ, నాయకులు పల్లేటివెంకన్న, వల్లపుదాస్ సాయికుమార్, అర్వపల్లి, లింగయ్య, సుభాష్, నాగరాజు పాల్గొన్నారు.