Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న బాధితులు
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని 30 పడకల ఆసుపత్రి లో ఉన్న ఐసోలేషన్ వార్డులో ఒకటే బెడ్ ఉండటంతో కరోనా సోకి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకి ఆయాసపడుతూ ఆక్సిజన్ అందక బయ బ్రాంతులకు గురి అయి అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఇక్కడ పడకలు లేక ప్రభుత్వ ఆసుపత్రులో ఒకటే పడక ఉండడం వలన వచ్ఛిన పేషెంట్‌కు ఆక్సిజన్ లెవెల్ చూసి 90 శాతం కంటే తక్కువ ఉంటే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి బదిలి చేస్తారు, లేకుంటే ఇంటికి పంపించేస్తారు. అటు ఏరియా ఆసుపత్రికి వెళితే ఆక్సిజన్ శాతం 90 కంటే ఎక్కువ ఉంటే ఇంటికీ పంపిస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి ఏర్పడింది. సామాన్యులకు ఇంటి వద్ద సపరేట్ గది, మరుగుదొడ్డి లేక అనేక ఇబ్బందులు పడుతూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కుటుంబంలో ఒకరి కి వస్తే అందరికీ వచ్చేస్తుంది. ఇటువంటి సామాన్య పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులో అధిక సంఖ్యలో పడకలు పెంచి కరోనా కట్టడి కి కషి చేయాలి. పట్టణంలోని ఇలా ఉందంటే గ్రామాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజాప్రతినిధులు 30 పడకల ఆసుపత్రిని వంద పడకల గా మారుస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.