Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్వపల్లి :మండలకేంద్రంలో,తిమ్మాపురంలో జరుగుతున్న కరోనాసర్వేను అదనపు కలెక్టర్ పద్మజారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైద్య బందానికి ప్రజలు సహకరిం చాలన్నారు. ప్రతి ఇంటిని వైద్యబందం సందర్శించి కరోనాను క్షేత్రస్థాయిలో నివారించడమే లక్ష్యమన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాల న్నారు.కరోనా సోకిన వారు బయటకు వెళ్లడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.వైద్యులు సకాలంలో కరోనా బారిన పడ్డ వారికి కిట్లను అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, సర్పంచ్ బైరబోయిన సునీత, ఉపసర్పంచ్ ప్రభాకర్, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ ఉమేశ్‌చారి, ఎంపీఓ సురేష్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, అంగన్వాడీలు నవనీత, సునంధ, ఆశా వర్కర్లు స్వరూప, అరుణ , బైరబోయిన రామలింగయ్య పాల్గొన్నారు.
సర్వే చేసిన వారికి రక్షణ కరువు
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సోకుతుందన్న భయాన్ని కూడా మర్చిపోయి మండల కేంద్రంలో కరోనా సోకిన వ్యక్తుల ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అంగన్వాడీ, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. కానీ వారికి ప్రభుత్వం కనీస ం మాస్క్‌లు కూడా అందజేయకపోవడం గమనార్హం.విషయం గమనించి మండల అభివృద్ధి అధికారి సురేష్ తన వాహనంలో ఉన్న మాస్క్‌లను వారికి పంపిణీ చేశారు.