Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వైనం
- మండల అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
నవతెలంగాణ-మోతె
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తరలిస్తే నిర్వాహకుల దందా జోరుగా సాగుతుందని రైతులు వాపోతున్నారు.మండలపరిధిలోని నామవరం ఐకేపీ కేంద్రంలో నిర్వాహకులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు మండల అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా రైతులు సుధీర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.తాము 500 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామన్నారు.తూకంలో తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు.500 క్వింటాళ్లలో 6 క్వింటాళ్ల ధాన్యం దోచుకున్నారని ఆరోపించారు.ఇలాగే రైతులందర్ని మోసం చేస్తున్నారని వాపోయారు.అనంతరం వెలుగు సీసీ విజయలక్ష్మీ, ఆర్ఐ మన్సూర్‌అలీ విచారణకు గ్రామానికి వచ్చారు.తూకాల్లో మోసం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు.కాంటాల్లో సమస్య ఉందని, వాటిని మార్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచఫ్ తండు యాదమ్మమల్సూర్, ఉపసర్పంచ్ రేణుక, రామ్మూర్తి, మాజీ సర్పంచ్ మట్టిపల్లి వెంకన్న, మాజీ ఎంపీటీసీ శ్రీను,శ్రావణ్, బాలయ్య పాల్గొన్నారు.