Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదరణ లేక భారీగా పాడిపోతున్న సంస్థ ఆదాయం
- 5రూట్లలోనే బస్సు సర్వీసులు
నవతెలంగాణ -నల్లగొండ
కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో జిల్లాలో ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోవడంతో సంస్థ నిర్వహణ భారంగా మారింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మినహాయింపు సమయంలోనే ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఆదాయంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి లాక్డౌన్ మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది. ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు ఏడాదిగా ప్రభుత్వం కార్గో సేవలను ప్రారంభించింది .దీంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీపై కరోనా పరిస్థితులు లాక్డౌన్తో కోలుకోలేని దెబ్బ పడుతోంది .నల్లగొండ డిపో పరిధిలో 500బస్సు సర్వీసులున్నాయి .ఇందులో 5రూట్లలో 20బస్సులను మాత్రమే నడుపుతున్నారు.10 రోజులుగా 4గంటల్లో సర్వీసులను నడుపుతున్న అంతంతమాత్రంగానే సంస్థకు ఆదాయం వస్తుంది.
4గంటలే సేవలు
లాక్డౌన్ పరిస్థితులలో ఆర్టీసీ రోజుకు నాలుగు గంటల పాటే ప్రయాణికులకు సేవలను అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 20బస్సు సర్వీసులను నడుపుతోంది.ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సర్వీసులను నడుపుతోంది నల్లగొండ డిపో నుంచి హైదరాబాద్, సూర్యాపేట, దేవరకొండ, నాగార్జునసాగర్, ఆలియా, 5రూట్లలోనే బస్సులు నడుస్తున్నాయి. మిగతా 480బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి .
తగ్గుతున్న ఆర్టీసీ ఆదాయం
అసలే ప్క్రెవేట్ వాహనాల పోటీకి తట్టుకోలేని ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని నష్టపోతోంది .దీనికి తోడు వరుసగా రెండవ ఏడాది కరొనా పరిస్థితులతో కోలుకోలేని దెబ్బ పడుతోంది.గతేడాది లాక్డౌన్ విధించడంతో నెలల పాటు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి .మళ్లీ ఈసారి సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో లాక్డౌన్ విధించడం వల్ల ఆర్టీసీకి ఇబ్బందికరంగానే మారింది .అడపా దడపాగా సర్వీసులను నడుపుతున్న ఆర్టీసీకి నష్టాలే మిగులుతున్నాయి .నల్లగొండ డిపోకి గతంలో అన్ని రూట్లలో500 బస్సు సర్వీసులు నడవగా రోజుకు రూ.12నుండి 13లక్షలు ఆదాయం వచ్చేది. లాక్డౌన్ సమయంలో రోజు 20 బస్సు సర్వీసులకు రూ. 60నుండి 70 వేలు మాత్రమే ఆదాయం రావడంతో బస్సులు నడిపిన ప్రయోజనం ఉండటం లేదని అధికారులు పేర్కొంటున్నారు .
కొద్దిమందితోనే సేవలు
లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ అతికొద్ది మంది సిబ్బందితోనే సేవలను కొనసాగిస్తుంది .రోజు నాలుగు గంటలు మాత్రమే బస్సు సర్వీసులను నడుపుతుండటంతో వందలాది మంది సిబ్బంది విధులకు దూరమవుతున్నారు.నల్లగొండ డిపో పరిధిలో 103 మంది సిబ్బంది ఉండగా 30మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు .రోజుకు 2 వేల నుండి 2500 కిలోమీటర్ల వరకు బస్సు సర్వీసులను తిప్పుతున్నారు -