Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పానగల్లో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన డీఐజీ
నవతెలంగాణ -నల్లగొండ
జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు కావాలని, వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు రావాలని డీఐజీ ఏవి.రంగనాథ్్ అన్నారు. గురువారం నల్లగొండ టూ టౌన్ పోలీసులు, నల్లగొండకు చెందిన ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలోని ఓఅర్జీ ఆధ్వర్యంలో పానగల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లక్షణాలతో ఇండ్లలో ఐసోలేషన్ చేసుకునే వసతి లేని వారికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐసోలేషన్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు. పానగల్ లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన నల్గొండ డాట్ ఓఆర్‌జి సభ్యులైన ప్రవాస నల్గొండ వాసులకు, 1, 2వ వార్డుల కౌన్సిలర్లకు, స్థానిక యువకులను అభినందనందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ నర్సింహులు, పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ గౌతమ్, నల్గొండ డాట్ ఓఆర్‌జి సమన్వయకర్త, పర్యావరణ ప్రేమికుదు మిట్టపల్లి సురేష్ గుప్త, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్‌బాబు, బుర్రి రజితయాదయ్య పాల్గొన్నారు.