Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయిటి పాముల లిఫ్టుతో త్వరలో సాగునీరు
- విలేకర్ల సమావేశంలో చిరుమర్తి
నవతెలంగాణ- నకిరేకల్
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నకిరేకల్‌కు వంద పడకల ఆస్పత్రి మంజూరైందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఆస్పత్రి మంజూరుకు చొరవ తీసుకున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్చేతల ప్రభుత్వమన్నాఉ. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 2 లక్షలా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి జరిగిందన్నారు. అయిటిపాముల లిఫ్ట్ ద్వారా త్వరలోనే రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుధ్య లోపం లేకుండా నకిరేకల్‌ను అన్ని రంగాలలో అభివద్ధి పరచడమే తన లక్ష్యమన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారు దైర్యంగా ఉండాలని, ఏ సమస్య వచ్చిన తనను నేరుగా సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైరెమ్న్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మెన్ మురారి శెట్టి ఉమారాణి కష్ణమూర్తి, కమిషనర్ బాలాజీ, వార్డు కౌన్సిలర్ కొండ శ్రీను, పల్లె విజరు, రాచకొండ సునీల్, గడ్డం లక్ష్మీనరసింహ స్వామి, సర్పంచ్ పగడపు నవీన్ రావు, నాయకులు గుర్రం గణేష్ పాల్గొన్నారు.
ఆస్పత్రి నిర్మాణ స్థల పరిశీలన
నకిరేకల్‌కు మంజూరైన వంద పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణం వల్ల నకిరేకల్‌తో పాటు ఇతర నియోజకవర్గ ప్రజలకు కూడా ఉచితంగా వైద్యం అందుతుందని హర్షం వ్యక్తం చేశారు.