Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
గతేడాది కరోనా కాలం నుండి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అనేక సహాయక సేవా కార్యక్రమాలకు స్పందించి చిట్యాలకు చెందిన రచయిత పగిడిపాటి నరసింహ 'అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సీతక్క' అనే పాటను రాసి ఆన్లైన్ గురువారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీతక్క మాట్లాడుతూ తన సేవా కార్యక్రమాలను గుర్తించి పాట రూపంలోకి తీసుకురావడం సంతోషదాయకమైన విషయమని తనకు లభించిన గౌరవానికి పాట రచయిత పగిడి పాటిని, సంగీత దర్శకులు డేవిడ్ కింగ్ ను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీ దేవి పాల్గొని పాట రచయితను ప్రశంసించారు.సృజన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో పెరుమాళ్ళ ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డాక్టర్ తండు కష్ణ కౌండిన్య, టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ, ములుగు జిల్లాల అధ్యక్షులు ఎడ్ల సైదులు, జి. సమ్మా రావు పాల్గొన్నారు. సాగర్ల సత్తయ్య, డా.మండల స్వామి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో కుకుడాల గోవర్ధన్, కొండ కింది అంజిరెడ్డి,నాగభూషణం , డా.పోరెడ్డి రంగయ్య, జటావత్ ముని నాయక్, జానకిరామ్, కంచి రవి కుమార్ ,పాల్వంచ హరికిషన్, దర్శనం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.