Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యదద్రి భువనగిరి జిల్లాల్లో జాతీయ రహదారి వెంట ఉన్న చౌట్టుపల్ తదితర ప్రాంతాలలో కరోనా కేసులు ఉన్నందున అవి తగ్గు ముఖం పట్టేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు సూచించారు. ుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి వరంగల్ ఎంజీఎంను పరిశీలించిన అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయం నుండి కోవిడ్ ఉధృతి నివారణా చర్యలు, లాక్ డౌన్ అమలు తీరుపై జిల్లా , పోలీస్ ఉన్నత అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. కరోనా చికిత్సా , ఆస్పత్రి సౌకర్యాల పై అరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , పోలీస్ తదితర శాఖలతో కరోనా ఉధతి పై సమీక్షి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా కరోనా బాధితులకు, అవసరమైన మందుల కొరత రాకుండా చూడాలన్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణపై కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మరో పదిహేను రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎంకు వివరించారు. శకరోనా బాధితులకు అండగా ఉండి సత్వరమే స్పందించి వైద్య సౌకర్యం అందేలా చూడాలని కలెక్టర్లను అదేశించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని, ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజల శ్రేయస్సు కోరి పెట్టిన లాక్ డౌన్ కరోనా కట్టడికి పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్న కూరగాయలు, పాలు, మటన్,ఫిష్ విక్రయదారులును గుర్తుంచి జాబితాలు పంపాలన్నారు., ఆక్సిజన్ కొరత ఉంటే ప్రభుత్వా ప్రధాకార్యదర్శి దష్టికి తేవాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ,అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ సాంబశివరావు పాల్గొన్నారు.