Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల్లో జాప్యం చెయొద్దు
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- రామన్నపేట
నకిరేకల్ నియోజకవర్గం లోని మూడు మండలాల రైతులకు ప్రయోజనం చేకూర్చే ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువల ఆధునికీకరణ పనులలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అధికారులు గుర్తించి ఎలాంటి జాప్యం లేకుండా పనులు నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులలో అలసత్వం వహించొద్దన్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి పనులలో వేగం పెంచాలన్నారు. ఇబ్బంది ఉన్న చోట ప్రత్యేక చొరవ తీసుకొని రైతులను ఒప్పించాలన్నారు. భూ సేకరణలో, నష్టపరిహారం చెల్లింపు విషయంలో జరుగుతున్న జాప్యం పై రేపే కలెక్టర్ తో సమావేశం సమావేశమవుతామన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ ఆనంద్, ఈఈ మనోహర్, డీఈ కష్ణా రెడ్డి, ఏఈఈ చంద్రశేఖర్, ప్రవీణ్, స్థానిక ఎంపీపీ జ్యోతి, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, నాయకులు ఉన్న జగన్ మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
కేతెపల్లి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇప్పలగూడెం క్లస్టర్లో ఉన్న గుడివాడ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను శుక్రవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల బాధలు తెలిసిన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రైతు సంక్షేమం అమలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, గుడివాడ, ఇప్పలగూడెం సర్పంచులు కట్ట శ్రవణ్‌కుమార్, దేవరకొండ వీరయ్య, మండల వ్యవసాయాధికారి పురుషోత్తం, ఏఈవోలు బాలరాజు, వీరేష్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కె.మహేందర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.